Charmi టాలీవుడ్ లో హీరోయిన్ ఛార్మి (Charmi)గ్లామర్ గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకానొక సమయంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే ఎప్పుడైతే పూరి జగన్నాథ్ తో జ్యోతిలక్ష్మి సినిమాలో నటించిందో అప్పటినుంచి వీరిద్దరి మధ్య పలు రూమర్స్ వినిపించాయి. దీంతో వీరిద్దరూ కలిసి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.. దీంతో ఛార్మి అసలు ఈ మధ్యకాలంలో కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు ఛార్మి.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చిన్న వయసులోని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 2011లో మొదట నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఆ తరువాత నితిన్ తో కలిసి శ్రీ ఆంజనేయం సినిమాలో నటించింది ఇందులో ఈమె అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మాస్ ,చక్రం, పౌర్ణమిz రాఖి, జ్యోతిలక్ష్మి ,మంత్ర వంటి సినిమాలలో నటించింది.
ఇలా వరుస సినిమాలతో హిట్టు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అది కూడా హీరోయిన్గా మాత్రమే జ్యోతిలక్ష్మి సినిమాలో నటించింది. గతంలో పూరి జగన్నాథ్ తో ఈమె సన్నిహితంగా ఉందని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని రోజుల నుంచి చార్మి నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు ఎప్పుడైతే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా అప్పటినుంచి ఈమే సైలెంట్ అయ్యింది.
దీంతో ఛార్మి చాలా నష్టపోయింది అనే వార్తల కూడా వినిపించాయి. ఈ తర్వాత మళ్ళీ ఛార్మి ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు అన్నట్లుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో కూడా పెద్దగా టచ్లో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సైలెంట్ గా ఉన్న ఛార్మి ఎప్పుడు స్పందిస్తుందా ఎప్పుడు సినిమాలలో నటిస్తుందా అంటూ అభిమానులు కామేత చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఛార్మి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.