వారి కోసమే బిజినెస్ ప్రారంభిస్తున్న: సన్నీ

Google+ Pinterest LinkedIn Tumblr +

సన్నీ లియోన్ ప్రస్తుతం భర్త, పిల్లలతో బిజీ గా గడుపుతుంది. తాజాగా కేరళ వరద బాధితుల కోసం 1200 కేజీల బియ్యం పంపించనున్నట్టు తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా తెలిపారు. అంతే కాకుండా తన నూతన బిజినెస్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సన్నీ లియోన్. ఈ ఏడాది తాను కాస్మెటిక్ బిజినెస్ ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు సన్నీ. అయితే ఈ బిజినెస్ కోసం తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లి తన నూతన బిజినెస్ గురించి వారికి అర్ధం అయ్యే విధంగా తెలుపనున్నానని ఆమె వెల్లడించారు. ఇందు కోసం ఆమె ‘ పాప్ అప్ స్టోర్ ‘ అనే ఒక పద్దతిని అవలంబించనున్నారట. ముఖ్యంగా మహిళలని ఆకట్టుకోవడానికి ఈ బిజినెస్ ఎర్పాటు చేస్తున్నానని ఆమె తెలిపారు.

ఈ విధానం యు ఎస్, యూ కే వంటి దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. కానీ మన దేశం లో అంతగా ఎవరికీ తెలియదు. ఈ విధానం ద్వారా ‘ స్వయంగా బిజినెస్ నిర్వహించే వారు స్వయంగా జనాలు అధికంగా ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్స్ వంటి ప్రాంతాలలో ఒక రోజు వర్క్ షాప్ లాగా నిర్వహించి జనాలకి తమ ప్రోడక్ట్ పై అవగాహన కలిగిస్తారు. అటు తర్వాత మరో ప్రాంతం లో ఇలానే ఒక రోజు లేదా రెండు రోజులు ఇంకో పాప్ అప్ స్టోర్ ఎర్పాటు చేస్తారు.
ఇప్పుడు సన్నీ ఇదే విధమైన విధానాన్ని తన నూతన బిజినెస్ కి వాడనున్నారని సమాచారం. చూడాలి సన్నీ లియోన్ అనుసరిస్తున్న ఈ విధానం తన బిజినెస్ కి ఎంత వరకు లాభాలు తెచ్చి పెడుతుందో.

Share.