టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఏదైనా విషయం పైన స్పందిస్తూ ఉంటారు హీరో రాజశేఖర్ ,జీవిత.. ఇప్పటివరకు రాజశేఖర్ లేకుండా జీవితాన్ని జీవిత లేకుండా రాజశేఖర్ ని అసలు మనం ఎక్కడా చూడలేదు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు ఈ జంట.. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తలంబ్రాలు అనే సినిమాతో మొదలైన వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది..
తాజాగా ఈ జంట మరొకసారి తమ లవ్ స్టోరీ ని అభిమానులతో పంచుకోవడం జరిగింది.వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక చిట్ చాట్ షోకు జంటగా వీరిద్దరూ హాజరయ్యారు. జీవితాను మొదటిసారి చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి తీసేయండి అని రాజశేఖర్ చెప్పారట. కానీ ఆ తర్వాత అదే సినిమాలో తనను తీసేసి మరొక హీరోతో చేశారని చెప్పారు.. ఆ తర్వాత మూడు సినిమాలు కలిసి చేశాక ఒకసారి రాజశేఖర్ తన వద్దకు వచ్చి నాకు ఎక్కడో మీరు నా మీద ఆసక్తి చూపిస్తున్నారేమో అన్నట్లుగా కనిపిస్తోంది అని తెలిపారట.
ముఖ్యంగా రాజశేఖర్ ను వివాహం చేసుకోవడానికి రాజశేఖర్ తల్లితండ్రులను ఒప్పించడానికి చాలా రిస్క్ చేశానని చెప్పింది. కానీ రాఘవేంద్రరావు మాత్రం రాజశేఖర విలన్ లా ఉన్నాడు నమ్మకు అంటూ జీవితాకి సలహా ఇచ్చారట.. ఆ తర్వాత రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసి హాస్పటల్లో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నల చేత ఓకే చేయించుకుందని తెలిపారు.
జీవిత సైతం రాజశేఖర్ దొరకడేమో అని చాలా బాధపడిందట మొదట రాజశేఖర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.