టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖవాణి ఎంతటి పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..రోజురోజుకు తన వయసుతోపాటు అందాన్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు సైలెంట్ గా చాలా పద్ధతిగా కనిపించిన సురేఖవాణి ఒక్కసారిగా తన కూతురితో కలిసి చేసేటువంటి రీల్స్ గ్లామర్ ఫోటోలు సైతం కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా కనిపిస్తున్నాయి. తరచూ సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు అందాల హడావిడి మామూలుగా ఉండదని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే తాజాగా కొత్త కారుకున్నట్లుగా తెలుస్తోంది సురేఖ వాణి. ఇకపై ఈ తల్లి కూతుర్లు ఆగరని అన్నట్లుగా కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికి చాలా సినిమాలలో సహాయక పాత్రలలో చేసిన సురేఖవాణి చాలా వరకు తన పాత్రలతో మంచి పేరును సంపాదించింది. ఎమోషనల్ కామెడీ వంటి సన్నివేశాలలో కూడా తననాటక బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఇలా ఒక ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు సంపాదించింది సురేఖవాణి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ తన హవా చూపిస్తోంది అని చెప్పవచ్చు.
ఇక తన కూతురు సుప్రీతా కూడా అందరికీ సుపరిచితమే.. వీరిద్దరూ కలిశారంటే చాలు తెగ రచ్చ చేస్తూ ఉంటారు.. సోషల్ మీడియాలో వీరిద్దరూ పంచుకొని ఫోటోలు చూస్తే మాత్రం అందరికీ మతి పోవాల్సిందే అన్నట్లుగా ఉంటాయి.. వీరిద్దరిని తల్లి కూతుర్లు అనడం కంటే అక్క చెల్లెలు అనడం బెటర్ అని ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉంటారు..సురేఖ వాణి తన కూతుర్ని హీరోయిన్గా చేయాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు.
మరి రాబోయే రోజుల్లో సుప్రీత హీరోయిన్గా నటించే అవకాశం ఉందేమో చూడాలి మరి. సురేఖ వాణి కొత్త కారుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి. ఇందులో కారు దగ్గర వీరిద్దరూ తెగ సందడి చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి.. కారులో తల్లి కూతుర్లు తిరుగుతూ మరింత రచ్చ చేయడం కాయమంటే అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.