టాలీవుడ్ లో హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..తెలుగులో సినిమాలలో నటించి సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాలలో నటించింది. కానీ ఇవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత మలయాళంలో పలు సినిమాలలో నటించి బిజీగా మారిపోయింది.. అనుకోకుండా డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఈమెకు అవకాశం ఇవ్వడంతో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి హనీ రోజ్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ముఖ్యంగా ఈమె గ్లామర్ షో చూపించడంలో హీరోయిన్లను మించిపోయి చూపిస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె అందచందాలకు నడుము ఒంపులకు కుర్రకారులు సైతం ఫిదా అయ్యారని చెప్పవచ్చు.. అలా ఈ ముద్దుగుమ్మ ఎంతో క్రేజీ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో కూడా బిజీగా ఉంటోంది.
పలు షాపింగ్ మాల్స్ , రెస్టారెంట్స్ ఓపెనింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈమె గురించి ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ఇలా షాపింగ్ మాల్స్ లేదా రెస్టారెంట్ ప్రారంభమైంచడానికి వెళ్లిన ఈమె ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేయాలన్న భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం . హానీ రోజ్ ఏకంగా రూ.7 నుంచీ రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ రేంజ్ లో ఈ మద్దుగుమ్మ ఒకవైపు సినిమాలలోని మరొకవైపు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా వుంటుంది… ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.