తెలుగు సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రోజులవి తరుణి రావు అనే దర్శకుడు దగ్గర వర్మ పని చేయడం జరిగింది. ఆ టైంలో రావు గారి ఇల్లు అనే సినిమాకి తరుణి రావు దర్శకత్వం వహిస్తున్నారట.ఇందులో జయసుధ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జయసుధని చూసి వర్మ ఆమెను ఇంప్రెస్ చేయాలనే తెగ ట్రై చేస్తున్నారట.. పైగా అప్పటికి ఆమెకు వివాహమైందని తెలిసి కూడా ఒక హీరోయిన్‌తో తనకు పరిచయం ఉందని చెప్పుకోగలగాలని తెగ ఆత్రుతగా ఉండేవారట రాంగోపాల్ వర్మ.
కానీ ఆ సమయంలో తరుణి రావు.. సీన్ పేపర్ తీసుకువెళ్లి జయసుధ గారి ఇంట్లో ఇచ్చేసి రమ్మని వర్మకు తెలిపారట. ఆ సీన్ కూడా వర్మనే రాయాలని చెప్పడం జరిగిందట. దీంతో రాత్రంతా వర్మ కూర్చొని అందంగా రాయాలని ప్రయత్నించి ప్రయత్నించి పదికి పైగా సార్లు కథని మార్చారట. అయినా కూడా రాత బాగాలేదని ఆ పేపర్లను చింపేసినట్లు తెలిపారు.. ఉదయం లేవగానే కాసేపు చక్కగా రాయడానికి ట్రై చేసిన చివరికి జయసుధ షూటింగ్ కి వచ్చే సమయానికి సీన్ పేపర్ తీసుకొని ఆమె చేతిలో పెట్టడం జరిగిందట వర్మ.
అది చూసిన జయసుధ ఈ సీన్ అంత బాగా రాసింది ఎవరు అని అడుగుతుందని భావించేలోగే.. ఆ పేపర్ ని అలా చూసి ఎన్ని పేజీలు అని సింపుల్ గా అడిగేసరికి వర్మ ఉత్సాహం పోయిందట.. కనీసం ఆ సమయంలో సీన్ ఏంటో అని చెప్పడానికి కూడా వర్మకు అవకాశం దొరకపోవడంతో కాస్త ఫీలయ్యానని తెలిపారు. మనీ సినిమా నిర్మిస్తున్న సమయంలో వర్మ జయసుధ ఇంటికి వెళ్ళి.. తలుపుతట్టగా అక్కడ ఎవరూ కనిపించలేదు.. కానీ వెనక్కు తిరిగి చూడగా జయసుధ భర్త నితిన్ కపూర్‌ను చూశాక జయసుధ పైన లవ్వు మొత్తం పోయిందని తెలిపారు వర్మ. నితిన్ కపూర్ హైటుకి వర్మ భయపడి తన మీద ఉన్న లవ్వుని అక్కడితో ముగించేసుకున్నారట ఈ విషయాన్ని వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.