బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న అజయ్ దేవగన్.. హీరోయిన్ టబు మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. 2015 నుంచి వరుసగా కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించారు ఇటీవల బ్లాక్ బాస్టర్ విజయాలో సాధించిన వీరు దృశ్యం లోను మళ్ళీ కలిసి నటించారు.. ఇప్పటికీ ఆ రిలేషన్షిప్ ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు.
అజయ్ దేవగన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు తన భార్య కాజోల్ కు కూడా చెప్పలేని రహస్యాలను తాగుతూ చెబుతూ ఉంటానని తాజాగా రివీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అజయ్ దేవగన్,టబు కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో టబు పలు విషయాలను ఓపెన్ గా చర్చించారు. అజయ్ దేవగన్ తో టబు తన బంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది.. టబు మాట్లాడుతూ.. అజయ్ దేవగన్ కోపంతో ఉన్నప్పుడు రిలాక్స్ గా ఉన్నప్పుడు అతడిని ఎప్పుడు ఒంటరిగా వదిలేయాలో నాకు తెలుసు అంటూ తెలియజేస్తోంది టబు.
టబు జాతీయ ఉత్తమ నటిగా కెరియర్ లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి పలు ప్రయోగాలకు కూడా వెనకాడలేదు.. ఇప్పటికీ ఎటువంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటుంది. టబు.. ఈ వయసులో కూడా రొమాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్నో పోలీస్ ఆఫీసు పాత్రల్లో కూడా కనిపించింది. టబు,అజయ్ దేవగన్ ఎన్నో చిత్రాలలో పనిచేశారు. అతని మూడు ఆలోచనలు ఎలా ఉంటాయో తనకి బాగా తెలుసని తెలిపింది. అతని చుట్టూ ఉన్నవాళ్లు అతనితో ఎలా పనిచేయాలో మీకు బాగా అర్థమైందా అని ప్రశ్నించగా అవును అతను ఏమి కోరుకుంటాడో నాకు తెలుసు అంటూ తెలియజేసింది. టబు.. ఇక తనకి ఇష్టాలు ఆ ఇష్టాలు ఎలాంటి సమయంలో ఎలా చేస్తారో అనే పని కూడా తెలుసు అని తెలిపింది.