టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవి తమ్ముడు మాత్రమే కాకుండా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అందులో కొంతమంది మాత్రమే బాగా రాణిస్తుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ కావడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక అమ్మాయి నిహారిక.
ఇమే నాగబాబు కు ముద్దుల కూతురు అని చెప్పవచ్చు. కానీ ఈమె మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఒకే మనసు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలలో చేసిన ఆమెకు పేరు మాత్రం పెద్దగా తీసుకురాలేదు. మెగా అభిమానులు నిహారిక సినిమాలు పెద్దగా నచ్చకపోవడంతో ఈమె వాటికి గుడ్ బై చెప్పేసింది. ఆ తరువాత జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
అయితే ఈ మధ్యనే వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.. జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడే చైతన్య.. వీరి పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లికి ముందు నుంచి ఈ జంట చాలా హడావిడి చేసింది.. ముఖ్యంగా డాన్స్ పాటలు ఇలా ఎన్నో వేడుకలు కూడా జరిగాయి ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో మెగా హీరోల సందడి కనిపించింది.
ఇక చైతన్య కి నాగబాబు కట్నం కింద రూ .10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.. అలాగే మరొక రూ .2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది నిహారిక పేరు మీద అల్లుడికి ఒక బంగ్లా కూడా ఇచ్చారు. అలాగే నిహారికాకు పెళ్లిలో ఖరీదైన బహుమతులు వచ్చాయి అందులో చిరంజీవి నుంచి వజ్రాల హారం దాని విలువ రూ .2 కోట్లు ఉంటుందట .అలాగే వరుణ్ తేజ్ కూడా రూ .2 కోట్లు విలువ చేసి ఒక గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ ఖరీదైన కారును ఇచ్చినట్లు సమాచారం.