ఆది పురష్ సినిమాపై మరొకసారి కేసు నమోదు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో అది పురుష్ సినిమా కూడా ఒకటి. భారీ అంచనాలు మధ్య ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా పైన ఎలాంటి హైప్ ఏర్పడలేదు. ఈ సినిమా విజువల్ ట్రీట్ సినిమాగా తెరకెక్కించడం జరుగుతోంది డైరెక్టర్ ఓం రౌత్.. ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోంది భారీ బడ్జెట్ తో T- సిరీస్ తో ఈ సినిమాని నిర్మించడం జరుగుతోంది.

Complaint filed against Prabhas and Kriti Sanon's Adipurush new poster in  Mumbai - India Today

అయితే ఈ సినిమాని ఎంతో రహస్యంగా షూటింగ్ చేసినప్పటికీ టీజర్ విడుదల చేయడంతో గత ఏడాది నుంచి ఈ సినిమా ట్రోలింగ్కు గురవుతూనే ఉంది. టీజర్ తోనే తీవ్రమైన డిసప్పాయింట్ చేసిన ఆదిపురుష్ సినిమా కొత్త వెర్షన్ తో ఆయన ఏమైనా అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి మరి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ సినిమా రీసెంట్గా శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది..

ఇప్పుడు ఈ పోస్టర్ విషయంలో కూడా కాంట్రవర్సీకి గురవుతోంది ఈ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమా పోస్టర్లు హిందూ మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని ముంబైకి చెందిన సంజయ్ దినానత్ అనే వ్యక్తి ఈ పోస్టర్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందులో ఉండే నటీనటుల వేషాధారణ సరిగ్గా లేవని అలాంటి దుస్తులు రాముడు వేసుకున్నట్టుగా ఎక్కడ పురాణాలలో లేదని అంటూ ఆరోపించారు.

ముఖ్యంగా ఇందులోని పాత్రలు జంజపుతాడు వేసుకున్నట్లుగా లేదు అని రామాయణాన్ని రాముని పాత్రలను చిత్ర టీం తప్పుగా చిత్రీకరించారని తెలిపారు. ఈ విషయంపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

Share.