ప్రముఖ హీరోయిన్ పూర్ణ గత ఏడాది డిసెంబర్ నెలలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఈరోజు (ఏప్రిల్ 4) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దుబాయ్ హాస్పిటల్లో బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అక్కడి డాక్టర్స్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది పూర్ణ. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి..
ఇకపోతే అమ్మగా మారిన పూర్ణ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా? లేక కొంతకాలం బిడ్డ ఆలనా పాలన చూసుకొని మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇటీవల రిలీజైన నాని దసరా సినిమాలో కూడా పూర్ణ నటించగా.. ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే పూర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చింది అని తెలిసి సర్వత్రా ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక పూర్ణ విషయానికి వస్తే రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూర్ణ ఆ తర్వాత మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే అక్టోబర్లో రహస్యంగా వివాహం చేసుకున్న ఈమె కేరళకు చెందిన శానిధ్ అసిఫ్ అలీ ని పూర్ణ వివాహం చేసుకుంది. ఈయన దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. ఇక పెళ్లైన రెండు నెలలకే డిసెంబర్లో తల్లి కాబోతున్నానని ప్రకటించిన పూర్ణ ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.