టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ లలో సుహాసిని కూడా ఒకరు.ఈమె పలు సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. కానీ మొట్టమొదటిగా తమిళ్ హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించింది. తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో శోభన్ బాబు వంటి హీరోలతో ఎక్కువ సినిమాలలో నటించింది. ఆ తరువాత వచ్చిన అగ్ర హీరోల సరసన నటించి మంచి స్టార్ డం పొందింది. అప్పట్లో చిరంజీవి ,సుహాసిని ,బాలకృష్ణ , సుహాసిని కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా శోభన్ బాబు, సుహాసిని కాంబినేషన్ లో సినిమాలు విడుదలయ్యాయి.
ఇక సుహాసిని తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.కెరీర్ విషయానికి వస్తే ఫామ్ లో ఉన్నప్పుడే ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం ను పెళ్లి చేసుకున్నారు. మణిరత్నంతో వివాహం జరిగిన తర్వాత కూడా సినిమాల్లో నటించింది. కానీ ఇంకా ఎత్తుకు ఎదగాల్సిన సుహాసిని మణిరత్నం పెళ్లి చేసుకోవడంతో ఆమె కెరీర్ కు బ్రేక్ పడిందన్న వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆమె ఆ టైంలో పెళ్లి వాయిదా వేసుకొని ఉంటే టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్గా చలామణి అయ్యేదని అభిమానులు భావిస్తున్నారు.
మణిరత్నానికి సుహాసిని లాంటి స్టార్ హీరోయిన్ భార్య అయినా కూడా ఆమెను తన కెరీర్ కు వాడుకున్నాడే తప్ప ఆమెను పెళ్లయ్యాక ప్రమోట్ చేయాలన్న ఆలోచన చేయలేదు. మణిరత్నం మంచి వ్యక్తి అయినా సుహాసినితో పోలిస్తే.. కాస్త ఎక్కువే దీంతో వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉండేవని అప్పట్లో అన్నారు. ఒకవేళ మణిరత్నం సుహాసినిని ఎంకరేజ్ చేసి ఉంటే తెలుగులో తమిళ భాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా మంచి సినిమాలు దక్కి ఉండేవి.ఏదేమైనా వివాహమైన తర్వాత ఈ మధ్యకాలంలో హీరోయిన్లు తమ హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.