టాలీవుడ్ అందాల హీరోయిన్ గా జయప్రద ఎన్నో చిత్రాలలో నటించింది.. ఈమె కెరియర్ లో అంతులేని కథ సిరిసిరిమువ్వ వంటి చిత్రంతో ఎంతో పేరు సంపాదించింది. ఇమేకు స్టార్ డమ్ తీసుకువచ్చింది మాత్రం అడవి రాముడు సినిమా అనే చెప్పవచ్చు. నవరత్న ఎన్టీఆర్ తో జయప్రద నటించిన తొలి చిత్రం కూడా అడవి రాముడు..1977లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత అదే ఏడాది ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చాణక్య చంద్రగుప్త సినిమాతో పాటు మా ఇద్దరి కథ యమగోల వంటి చిత్రాలలో జయప్రద నటించినది.
దీంతో రామారావుకు హిట్ పేరుగా పేరుపొందింది. ఈమె మరుసటి ఏడాది మేలుకొలుపు, యుగ పురుషుడు, రాజపుత్ర రహస్యం వంటి సినిమాలలో ఎన్టీఆర్ తో జోడి కట్టి మైమరిపించింది జయప్రద. ఆపైన ఎన్టీఆర్ డైరెక్షన్లో తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లో జయప్రద నటించింది.. ఆ తర్వాత చాలెంజ్ రాముడు, సర్కస్ రాముడుసూపర్ మెన్ తదితర చిత్రాలలో జోడి కట్టి నటించింది జయప్రద. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని జానపద చిత్రాలే నటించడం విశేషం.
ఆ రోజుల్లో ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరోగా కొనసాగుతున్న వారిలో కృష్ణ కూడా ఒకరు.కృష్ణ, జయప్రద పలు చిత్రాలలో నటించారు. కృష్ణ సరసన విజయనిర్మల తర్వాత ఎక్కువ చిత్రాలలో నటించిన జయప్రద. కృష్ణ తో వరుస సినిమాలు చేస్తున్న జయప్రద ఎక్కడ పెద్దాయనను ఏమో అన్నదన్నట్లుగా వార్తలు వినిపించాయి..
కానీ అవి నిజమో కాదో తెలియకుండానే కొంతమంది ఎన్టీఆర్ వద్దకు ఈ విషయాన్ని చేర్చడం జరిగింది. దీంతో రామారావు సైతం ఆమెను దూరం పెట్టారట.. ఆ సమయంలో ఎన్టీఆర్ తో సినిమాలు రావడం లేదని ఆ తర్వాత ఎన్టీఆర్, శ్రీదేవి జోడిగా నటించడంతో ఎన్టీఆర్, జయప్రద జంట ఊసే ఎత్తలేదు. ఈ విషయం తెలుసుకున్న లోపే ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జయప్రద హిందీ చిత్రాల వైపు బిజీగా మారింది. జయప్రద రాజకీయాలలో రాణించడానికి కారణం ఎన్టీఆర్ కూడా ఒకరు చెప్పవచ్చు.