కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఆశగా ఎదురుచూసిన ఐపిఎల్ మూమెంట్ నిన్నటి రోజున ప్రారంభమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో చాలా ఘనంగా ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరుపొందిన తమన్నా, రష్మిక ఫస్ట్ టైం అక్కడ చిందులేయడం జరిగింది. ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ గతంలో ఎక్కువగా ఆడి పాడేవారు.
మన తెలుగు బ్యూటీస్ ఆడి పాడింది లేదు కానీ మొదటిసారి తమన్నా, రష్మిక ఇలా తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబెట్టారని చెప్పవచ్చు. వరుస ఆఫర్లు అందుకుంటూ బాలీవుడ్ ని షేర్ చేస్తున్న తమన్నా, రష్మిక తమ డాన్సులతో ఐపీఎల్ స్టేడియం పై అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇక అక్కడ వీరు డ్యాన్సులకు అరుపులు కేకలతో రచ్చరచ్చ చేశారు.. తమన్నా మోడల్ దుస్తులలో ఆకట్టుకుంటే రష్మిక ట్రెడిషనల్ లెహంగాలు అందరిని ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు పాటకు కూడా డాన్స్ వేయడం జరిగింది.. రష్మిక, తమన్నా ఇలా డాన్స్ చేయడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరు రూ .5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రష్మిక ఉండే క్రేజ్ తమన్నాకి ఉండే క్రేజ్ ఆధారంగా ఇస్లీ టీం వీరికి అడిగినంత ఇచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత భారీ మొత్తంలో అందుకున్న హీరోయిన్లుగా కూడా పేరుపొందారు ప్రస్తుతం వీరిద్దరూ వేసిన డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి
రష్మిక ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తోంది తమన్నా భోళాశంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఎవరు వారీ షూటింగులలో వారు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఒకవైపు స్టేజ్ పైన డాన్సులు సినిమాలతో బాగానే సంపాదిస్తున్నారు.
Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN
— IndianPremierLeague (@IPL) March 31, 2023