సీనియర్ సూపర్ స్టార్ సినిమా ఇటీవల నరసింహచారి దర్శకత్వంలో వచ్చిన రంగస్వామి సినిమా వీక్షించి తన మనసులో మాట బయటపెట్టారు.. అసలు విషయంలోకెళితే సకారం మారుతి, భాస్కర్ రెడ్డి , చిత్రం శ్రీను, పల్సర్ బైక్ ఝాన్సీ , మీనాక్షి రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రంగస్వామి. ఈ సినిమాను డ్రీం ప్రతాపంపై నిర్మిస్తున్నారు . ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ నటుడు సుమన్ వీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..” యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందంగా ఆస్వాదిస్తారో.. ఆ డ్రగ్స్ ఉపయోగించిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు కూడా అంతే విషాదాన్ని నింపుతాయి.
ఈ విషయాన్ని ఇందులో చాలా చక్కగా చూపించారు.ఈ చిత్రం యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అనిపించింది. ఎమోషన్స్ పండించడం చాలా కష్టం.. కానీ ఈ సినిమాలో దానికి ఎక్కువ మార్కులు పడతాయి.. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది.. సినిమా చూసిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయ్యింది అంటూ సుమని చెప్పుకొచ్చారు. సినిమా కథలు సమాజానికి చాలా అవసరం” అని కూడా సుమన్ తెలిపారు.
ఇకపోతే సుమన్ విషయానికి వస్తే.. దాదాపు కొన్ని వందల చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన సుమన్ హీరోగా, విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడప పాత్రలు చేస్తున్న ఈయన మంచిగా తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా పాత్ర వస్తే చేయడానికి సిద్ధమే అన్నట్లుగా చెబుతున్నారు. ఇకపోతే ఎక్కువగా సోషయో ఫాంటసీ సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉందంటూ చెబుతున్నారు సుమన్. ఇకపోతే రంగస్వామి చిత్రం ద్వారా పల్సర్ బైక్ పాట ఫేమ్ ఝాన్సీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పవచ్చు.