సాధారణంగా బాలీవుడ్ అంటే చాలా మంది హీరో హీరోయిన్లకు గొప్ప అన్న భావన కలుగుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమ టాలీవుడ్ ను చాలా చీప్ గా చూసిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంటుంటే అందరూ మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడున్న నటీనటులు మాత్రం సౌత్ ఇండస్ట్రీ యొక్క విలువను తెలుసుకోలేక బాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ పరువు మొత్తం తీసేసింది..బాలీవుడ్ అంటేనే ఒక చెత్త అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్ పదవ తరగతిలో ఉన్నప్పుడే సినిమా చేసింది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో చేసిన ఈమెకు చందమామ, మగధీర సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో ప్రతి టాప్ హీరోతో కూడా నటించింది. 2020లో పెళ్లి చేసుకోవడానికి ముందు వరుస పెట్టి సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక కొడుకు పుట్టడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.
ఒకవైపు తమిళ్లో ఇండియన్ 2 సినిమాలో నటిస్తుండగా.. మరొకవైపు తెలుగులో బాలయ్య కు హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ” రైజింగ్ ఇండియా” పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో కాజల్ అగర్వాల్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఎలాంటి తేడా ఉంటుందనేది ఆమె క్లియర్ గా చెప్పుకొచ్చింది. ” దక్షిణాది పరిశ్రమలో విలువలు, క్రమశిక్షణతో పాటు న్యాయం కూడా ఉంటుంది. అదే బాలీవుడ్లో చూసుకుంటే ఇది పెద్దగా ఉండవు” అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కు బదిలీస్తూ స్పష్టం చేసింది. ఇకపోతే ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.