మెగా ఫ్యామిలీ అంటే ఒక టాలీవుడ్ లోనే కాదు యావత్ ప్రపంచమంతా మంచి గుర్తింపు లభించింది. అందుకు కారణం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటించి.. ఓవర్ నైట్ లోనే గుర్తింపు తెచ్చుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ఈ పాటలో స్టెప్పులేసిన రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు లభించింది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాలేదు.
వాస్తవానికి ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల పార్టీకి రాలేదు. అయితే అల్లు అర్జున్ కూడా రాకపోయేసరికి సోషల్ మీడియాలో సంచలనం కలిగింది. ఇది అనేక రకాల ఊహాగానాలకు దారితీసింది. అయితే ఎట్టకేలకు అల్లు అర్జున్ బృందం స్పందించింది. సాధారణంగా సోషల్ మీడియాలో ఫాన్స్ వార్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇటీవల బన్నీ, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య కూడా ఇదే తరహాలో యుద్ధ వాతావరణం నెలకొంది.. దారుణంగా నెగిటివ్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు.. ఇక ఆ ట్వీట్స్ ఎంతగా వైరల్ అవుతున్నా కూడా మొదట్లో ఎవరు పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు.
కానీ ఇప్పుడు ఈ వార్ కుటుంబాల వరకు వెళ్లడంతో స్పందించాల్సి వచ్చింది. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ వియత్నాంకు వెళ్లడం వల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే పార్టీకి హాజరు కాలేనని ముందుగానే చరణ్ కి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ సోదరి కూడా ఈ పార్టీకి హాజరు కాలేదు. ఆమె కూడా విదేశాల్లో ఉండడం వల్లే హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ వీడియో కాల్ లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు అల్లు అర్జున్ టీం వెల్లడించింది. అంతే కాదు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి బన్నీ బర్తడే విషెస్ చెప్పాడట. అయితే ఈ విషయం తెలియకపోవడం వల్ల కొంతమంది అనవసరంగా సోషల్ మీడియాలో రచ్చ చేశారు.