ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటుంది. అలాంటి ఈమె ఇప్పుడు తాజాగా ఎఫైర్ వార్తల్లో నిలుస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకరికి ముగ్గురితో ఆమెకు ఎఫైర్ అంట గడుతూ కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లతో ఆమె ఎఫైర్ నడిపారు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
ఈ వార్తలు సద్దుమణిగేలోపే క్లాస్మేట్ తో ఆమె ప్రేమలో ఉన్నారు అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళకు చెందిన రిసార్ట్ ఓనర్ కీర్తి సురేష్ క్లాస్మేట్ అని.. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని.. వీరి బంధం గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిన పక్షంలో త్వరలో పెళ్లి ప్రకటన రావచ్చు అంటూ బాగా వార్తలు వినిపించాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం స్పందించలేదు. తాజాగా కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ ఓపెన్ అయ్యారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న మేనకను కీర్తి సురేష్ పెళ్లి పై వస్తున్న రూమర్స్ గురించి అడగ్గా కీర్తి ఎవరిని ప్రేమించడం లేదు.. అలాంటిదేమైనా ఉంటే ముందు మాకే చెబుతుంది .. అప్పుడు మేము బహిరంగంగా మీడియాకు చెబుతాము.
ఆమె ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న కథనాలు నిరాదారమైనవి .. తన మీద ఇలా పుకార్లు పుట్టిస్తున్నారంటే ఆమె కెరియర్లో ఎదుగుతున్నారని అర్థం.. కీర్తి సురేష్ అన్ని విషయాలు మాతో చెబుతుంది.. భవిష్యత్తులో ఎప్పుడైనా తాను ప్రేమిస్తే అప్పుడు త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ప్రకటించి మీడియాతో చెబుతాము అంటూ తెలిపారు మేనక. తాజాగా ఈమె నటించిన దసరా సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.