టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లలలో భానుప్రియ కూడా ఒకరు.ఈమె స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భానుప్రియ చూడ చక్కని అందంతో తెలుగమ్మాయిల ఉండేది.అయితే ఈమెని అప్పట్లో హీరో సుమన్ ప్రేమించాడట. సినీ ఫీల్డ్ లో ప్రేమలు కామన్ ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎవరికి తెలియదు. కొందరివి షూటింగ్ వరకే పరిమితమవుతాయి.. మరికొందరికి పెళ్లి పీటల వరకు వస్తాయి. ఇలాంటి ప్రేమలో అరుదైనదిగా ఉన్నది హీరో సుమన్ ప్రేమ.
సితార సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ గా నిలిచింది.ఈ సినిమాకి దర్శకుడిగా వంశీ వహించాడు. ఈ సినిమా అంతా ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే సుమన్, భానుప్రియ ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం దర్శకుడు వంశీకు కూడా తెలుసట ..అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ భానుప్రియ ఇష్టపడిందా? లేదా? అనేది తెలియలేదు. అయితే ఇలా ప్రేమించటం కృష్ణవంశీకి నచ్చలేదు. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగింది. అయితే ఉన్నట్టుండి రాజమండ్రి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు.
హైదరాబాద్ హోటల్లో కృష్ణవంశీ, సుమన్ ఉన్నారట. అక్కడే కృష్ణవంశీ ఈ మ్యాటర్ ని తేల్చేశారని సమాచారం..సినిమా ప్రేమలు సినిమాలకె పరిమితం.. ఇవి వద్దు అని చెప్పారట కృష్ణవంశీ . ఆ తర్వాత అత్యంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేశారట..కానీ అప్పటినుంచి సుమన్ తో కానీ భానుప్రియతో కానీ మళ్లీ సినిమా ప్లాన్ చేయలేదట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే..భానుప్రియ ను సుమన్ మాత్రమే ప్రేమించలేదు. దర్శకుడు వంశీ కూడా ప్రేమించాడు. వీరిద్దరికీ అడ్డుగా ఉండేది వంశీ నే. సుమన్ , భానుప్రియ ప్రేమకు విలన్ అయ్యాడు వంశీ.