రాహుల్ గాంధీ పై అలాంటి కామెంట్స్ చేసిన ప్రముఖ నటి రమ్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన అభి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రమ్య అలియాస్ దివ్య స్పందన .. తర్వాత ఏడాది కుట్టు అనే చిత్రంలో తమిళ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు కూడా బోలెడన్ని అవకాశాలు తలుపుతట్టాయి. అలా తమిళ్, కన్నడ, హిందీలో కూడా సినిమాలు చేసిన ఆమె తెలుగులో అభిమన్యు అనే ఒక సినిమాలో నటించారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

Disastrous mistake': Actress-turned-politician Ramya opens up on Rahul  Gandhi

రమ్య మాట్లాడుతూ.. “నా తల్లిదండ్రులే నా ప్రాణం.. నాన్న చనిపోయిన రెండు వారాలకి నేను పార్లమెంటులో అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంట్ కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పని వైపు మళ్ళించాను. అంతటి శక్తిని నాకు మాండ్య ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులలో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖం లో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరొకవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో నాకు తోడుగా ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే.. నన్ను మానసికంగా ధైర్యంగా మార్చారు.. నాకు ఎంతో సపోర్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇకపోతే 2012 రాజకీయాలలో ప్రవేశించినప్పుడు 2013లో మాండ్యా లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు .తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలుగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేసిన ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఉత్తరకాండ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు.

Share.