Anushka..టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క(Anushka) శెట్టి సూపర్ సినిమాతో మొదటిసారి తన కెరీర్ను మొదలుపెట్టింది.. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది..స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని సంవత్సరాల నుంచి అనుష్క సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. కేవలం మిస్ శెట్టి మిస్సెస్ పోలిసెట్టి అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది.ఈ మధ్యకాలంలో అనుష్క కొన్నిచోట్ల బయట కనిపించడంతో ఫోటోలు, వీడియోలు చాలా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం అనుష్క చాలా బొద్దుగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేయడం జరిగింది.
అయితే అనుష్క బరువు పెరగడానికి థైరాయిడ్ కారణమే వార్తలు వినిపిస్తున్నాయి. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా థైరాయిడ్ వల్ల ఆమె తగ్గలేకపోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క స్లిమ్ లుక్ లోకి మారితే ఆమెకు ఆఫర్లు పెరుగుతాయని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అనుష్క థైరాయిడ్ తో బాధపడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ వార్తలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.
అనుష్క రెమ్యూనరేషన్ కోటి రూపాయలకు అటు ఇటుగా ఉన్న ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులలో మాత్రమే నటిస్తోంది. ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు అనుష్క భిన్నమైన కథలకు ఓకే చెప్పాలని మరి కొంతమంది అభిమానులు సూచిస్తున్నారు మరి కొంతమంది సూచనలు ఇస్తున్నారు. ఇక అనుష్క సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పలువురు అభిమానులు అయితే కోరుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా అనుష్క పెళ్లికి సంబంధించి పలు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వాటిపైన ఈమె ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక గతంలో ప్రభాస్ అనుష్క వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి. మరి ఈయేడాదైనా అనుష్క వివాహం చేసుకుంటుందేమో చూడాలి మరి.