నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.మరొకవైపు రాజకీయాలలో అలాగే డిజిటల్ మీడియాలో కూడా పలు రియాలిటీ షో లలో పాల్గొంటూ ఆడియన్స్ కి చేరువవుతున్నారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో వల్ల బాలయ్య మరింత పాపులర్ సంపాదించారు. పలువురు సెలబ్రిటీ రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ తనదైన స్టైల్ లో పాపులారిటీ సంపాదించారు. అన్ స్టాపబుల్-2 లో పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి హీరోలతో బాలకృష్ణ ఇంటర్వ్యూలు చేయడం విశేషమని చెప్పవచ్చు.
ఇక ఆహా ఓటీటి వేదికగా ఇండియన్ ఐడియల్ తెలుగు సీజన్ -2 లో బాలకృష్ణ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం జరిగింది. గత సీజన్ లో కూడా బాలకృష్ణ గెస్ట్ గా పాల్గొన్నారు. తాజాగా మొదలైన సీజన్-2 లో కూడా పాల్గొనడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సీజన్-2 సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.. ఇక ఈ ప్రోమోలో నవదీప్, బిందు మాధవి తన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ,నవదీప్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.. నవదీప్ ని ఉద్దేశిస్తూ ఆదివారం టీవీ ఆన్ చేస్తే శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్ కారు వదిలి పారిపోయిన నవదీపంటూ ఒకటే రచ్చ అంటూ బాలయ్య నవ్వుతూ నవదీప్ మీద కౌంటర్లు వేశారు..
ఇక నవదీప్ కూడా బాలకృష్ణ వ్యాఖ్యాలను సరదాగే తీసుకున్నారు. మీడియా న్యూ సెన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి బాలకృష్ణ సదరు వాక్యాలు చెప్పినట్లుగా సమాచారం బాలకృష్ణ వాక్యాలకి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.చివరిగా నవదీప్ బిందు మాధవి నటించిన నాన్సెన్స్ వెబ్ సిరీస్ కి బాలయ్యతో పాటు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది.