Naga Chaitanya..టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. నాగచైతన్య(Naga Chaitanya) ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు ఇక అఖిల్ మాత్రం అఖిల్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఇదంతా ఇలా ఉంటే సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య తాజాగా ఒక ఇంటిని కట్టించుకోవడం జరిగింది.అందుకు సంబంధించి గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నాగచైతన్య అత్యంత విలాసమైన ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ఖర్చు ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. సమంత నాగచైతన్య గతంలో జూబ్లీహిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులో నివాసం ఉండేవారు.
కానీ సమంత నుంచి విడిపోయిన తర్వాత చైతన్య ఆ ఇంటికి అసలు వెళ్లలేదట. ఆ తర్వాత సమంత కూడా ఆ ఇంటిని అమ్ముకొని వేరొక ఇల్లు కొనుక్కున్నట్లు సమాచారం. సమంతానుండి విడిపోయిన తర్వాత కొంతకాలానికి తన తండ్రితో కలిసి జీవించిన నాగచైతన్య తాజాగా ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అది కూడా జూబ్లీహిల్స్లో నాగచైతన్యకు నచ్చినట్టుగా ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సన్నిహితులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ ఇంటి కోసం రూ .15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. నాగచైతన్యకు ఈ ఇంటి తో పాటు మరికొన్ని విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కోట్లు విలువ చేసే లగ్జరీకారులు బైకులు కూడా ఉన్నాయి మొత్తానికి సమంత దూరమైన తర్వాత ఇంత కాలానికి నాగచైతన్య తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకోవడంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.