Meena..టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనా(Menna )గురించి చెప్పాల్సిన పనిలేదు… ఆమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యింది ..అయితే ఇప్పుడు మీనా పై ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఆమె రెండవ పెళ్లి వార్త ఇది వరకే మీనా పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా మళ్లీ వస్తున్న పెళ్లి వార్తలు తీవ్రంగా ఖండించింది మీనా.
నటి మీనా భర్త గతేడాది జూన్ 28న మరణించిన సంగతి మనకు తెలిసిందే..అయితే విద్యాసాగర్ మరణించిన తరువాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి పలు సినిమాల్లో నటిస్తూ కాలాన్ని గడుపుతోంది కుటుంబ సభ్యులు రెండవ వివాహం చేసుకోవాలని ఎంతో ఫోర్స్ చేస్తున్న మీనా మాత్రం ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె రెండో పెళ్లి వార్త వినిపిస్తోంది. కానీ మీనా మాత్రం నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
అయితే ఓ తమిళ యూట్యూబ్ వీడియో ద్వారా ఆమె త్వరలో తమిళ హీరోనీ పెళ్లి చేసుకోబోతున్నారని అంతేకాకుండా ఆమె కంటే ఆ హీరో చిన్నవాడని నిశ్చితార్థం కూడా జరిగినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు కోలీవుడ్ లో పాటు టాలీవుడ్ లోనూ మీనా రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే మరికొందరు ఈ కామెంట్స్ చేసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై తాజాగా నటి మీనా కూడా స్పందించారు.
డబ్బు కోసం పేరు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతుంది ఫైర్ అయ్యింది. అంతేకాకుండా తన భర్త చనిపోయినప్పుడు రకరకాల తప్పుడు వార్తలు కూడా రాశారని ఇంకొకసారి ఇలాంటి రూమర్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మీనా.