సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక… ఎప్పటి విషయాలో ఇప్పుడు బయటకు తీస్తున్నారు.మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ఈ మధ్యకాలంలో కామన్ గా వినిపిస్తోంది. అయితే అలాంటి ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మిణి నీ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు హీరోగా ఉన్నా మహేష్ బాబు కి ఇచ్చిపెళ్లి చేయాలని అనుకున్నారట…కానీ దేవుడు రాసిన రాతకి తిరుగులేదు కాబట్టి బ్రాహ్మిణి ..నారావారి ఇంటి కోడలు అయ్యింది. నమ్రత ఘట్టమనేనీ కోడలు అయింది.
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ కృష్ణ గారంటే ఎంతో ప్రత్యేకమైన గౌరవం ఉండేది. తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇద్దరు మంచి స్నేహితులు.. ఆ కారణం వల్లనే నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబుని అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయం కృష్ణకు కూడా తెలుసట. అయితే అప్పటికే మహేష్ బాబు నమ్రత ప్రేమించుకున్నారని తెలిసింది. అందుకనే పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేయడం కంటే వారి ఇష్టపడిన అమ్మాయిని చేయటం మంచిదని మహేష్ కి నమ్రతానిచ్చి పెళ్లి చేశారు.
అంతేకాదు ఒకవేళ ఈ సంబంధం కుదిరి ఉంటే నిజంగా ఇండస్ట్రీలో ఒక మధురమైన మూమెంట్గా మిగిలిపోయి ఉండేది. నందమూరి ఇంటి అల్లుడిగా మహేష్ బాబుని ఊహించుకుంటేనే అదొక మిరాకిల్ గా ఉంది. అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం ఎప్పుడో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు బయటకి పెట్టడం వల్ల ఏం ఉపయోగం దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వార్తను ఇక్కడితో ఆపేస్తే మంచిది అంటూ కొందరు నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆకతాయి కుర్రాళ్ళు పని పాట లేక ఇలాంటి విషయాలను బయటకు తీస్తూ సంతోషిస్తూ ఉంటారు.