Rashmika: రష్మిక సర్జరీ వికటించిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Rashmika..టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక (Rashmika)ప్రస్తుతం చేతినిండా వరస సినిమాలతో బిజీగా ఉంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈమె బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల అవకాశాలు అందుకుంటూనే ఉంటోంది. తాజాగా రష్మిక బాలీవుడ్ హంగామా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనింది. దక్షిణాదికి చెందిన కొంతమంది హీరోయిన్స్ ప్రతిభావంతులైన బాలీవుడ్ నటీమణులు తరచూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 రష్మిక మందన్న లేటెస్ట్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు... అన్ని చోట్ల వైరల్‌గా మారాయి.. ప్రస్తుతం ఈ భామ పుష్ప 2తో అల్లు అర్జున్‌తో బిజీగా ఉంది. దీంతో పాటు నితిన్‌తో మరో తెలుగు సినిమా కూడా చేయనుంది.

అయితే ఇక్కడే రష్మిక లుక్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి కలిగించేలా చేస్తోంది.పూర్తిగా డిఫరెంట్గా కనిపించే రష్మికను ఇలా చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక నెటిజెన్స్ ఈమె డిఫరెంట్ లుక్ పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగా రష్మిక ఫుల్ స్మైల్ తో కెమెరాకు ఫోజులిచ్చింది. అయితే ఈమె స్మైల్ లుక్ లో కాస్త మార్పు వచ్చినట్టుగా ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. రష్మిక ఏదో సర్జరీ చేయించుకుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ నటిమనులు సర్జరీ చేయించుకోవడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.

 ఎప్పటిలాగే.. రష్మిక మందన్న ఫుల్‌ స్మైల్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది. అయితే నటి లుక్‌లో మార్పు వచ్చిందని.. ఆ నటికి ఏదో సర్జరీ చేయించుకున్నారని టాక్‌ నడుస్తోంది. బాలీవుడ్‌లో నటీమణులు సర్జరీ చేయించుకోవడం సర్వసాధారణం.

రష్మిక బ్లాక్ అండ్ వైట్ గౌనులో కనిపించింది . స్ట్రైట్ హెయిర్ తో సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుంది .కానీ రష్మిక చిరునవ్వుల్లో పెదాలు చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొత్త లుక్ చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ..కొందరు రష్మిక లావు అయిందని కామెంట్లు చేయగా మరి కొంతమంది ఇంత డిఫరెంట్ గా కనిపించడానికి గల కారణం మాత్రం రష్మిక చెప్పాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది ఇదంతా మేకప్ ప్రభావం కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా రష్మిక లుక్ కు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రష్మిక పుష్ప-2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ తో కూడా మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ లో కూడా యానిమల్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Share.