Meena..అలనాటి హీరోయిన్లలో మీనా( Menna )కూడా ఒకరు. ఈ అప్పట్లో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. 1975 వ సంవత్సరంలో తమిళనాడులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ 6 సంవత్సరాల వయసులోనే చైల్డ్ యాక్టర్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో అవకాశాలు అందుకున్న మీనా 1990 సంవత్సరంలో హీరోయిన్గా మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్ర ప్రసాద్ నటించిన నవయుగం అనే చిత్రం ద్వారా ఈమె హీరోయిన్గా అడుగుపెట్టింది.
ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అనేక పాత్రలలో నటించింది మీనా అందుకే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. మీనా తెలుగు, తమిళ్ వంటి భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది. అప్పట్లో టాప్ హీరోలైన చిరంజీవి, బాలయ్య ,వెంకటేష్ ,నాగార్జున ఇలా ఎంతోమంది హీరోలతో కూడా నటించింది. ఇక 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యాసాగర్ తో వివాహం జరిగింది.
ఆ తర్వాత నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది మీనా. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది. గత ఏడాది కోవిడ్ సమస్యలతో మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మీనా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది .అదేమిటంటే త్వరలోనే మీనా రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
ఇటువంటి తరుణంలో తమిళ నటుడు బెయిల్వాన్ రంగనాథ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీనా ఒక 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ హీరోని వివాహం చేసుకోబోతోందని తెలిపారు.దీంతో ఆ నటుడు ఎవరో అని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. బెయిల్వాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మీనా మాత్రం ఈ వాక్యాలను ఖండించినట్లుగా తెలుస్తోంది .