Bhanusri mehra:ఇండస్ట్రీపై సంచలన ట్వీట్ చేసిన హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Bhanusri mehra.. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ భాను శ్రీ మెహ్రా (Bhanusri mehra). తను నటించిన ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో ఈమె ఫేస్ రివిల్ చేయకపోవడమే అని చెప్పవచ్చు. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ,పంజాబ్, తమిళ్ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది ఇవి కూడా పెద్దగా సక్సెస్ తేలేకపోయాయి.

Bhanu Sri Mehra's tweet leads to trolling of Allu Arjun - Telugu News -  IndiaGlitz.com

భాను శ్రీ ఆ తరువాత సైలెంట్ గా అయిపోయిన ఈ అమ్మడు ఇటీవలే అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారంటూ మళ్ళీ వార్తలలో నిలుస్తోంది. తాజాగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇదేనంటూ ఒక సంచలన ట్విట్ షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.

సినీ పరిశ్రమలో ఉన్న అతిపెద్ద సమస్య వయస్సు వయసుకు వచ్చిన స్త్రీలను వివాహమైన మహిళలకు కేవలం తల్లి సోదరి వదిన పాత్రలకే పరిమితం చేస్తూ ఉంటారు. కానీ పురుషులకు వచ్చేసరికి తమకంటే చిన్నవారైనా నటులకు ప్రేమికుడిగా కనిపించేలా చేస్తూ ఉంటారు. స్త్రీల విలువ వయస్సులో లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా ఎంపిక చేయడం ఎలా జరుగుతుంది అంటూ తెలియజేస్తోంది. ఇలాంటి పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది.

ఇక అంతే కాకుండా ధైర్యవంతులు స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి.. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది దీనిని మీరు అంగీకరిస్తారో అంటూ ప్రశ్నించడం జరుగుతోంది..ప్రస్తుతం భాను శ్రీ షేర్ చేసిన ఈ ట్వీట్ నేటిజన్లో పలు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని అంగీకరించగా మరి కొంతమంది ఇది సమస్య కాదు అంటూ వయసు కంటే హార్డ్ వర్క్ ముఖ్యమని వివాహం తర్వాత ఎంతోమంది హీరోయిన్స్ సినిమాలు చేస్తున్నారని మీరు కూడా చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share.