Fariya Abdullah..టాలీవుడ్ లో అత్యధిక హైట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఉత్తరాది హీరోలలో తెలుగు హీరోలంతా భారీ హైట్ అయితే కాదు కేవలం మహేష్ ,ప్రభాస్, రానా ,పవన్ కళ్యాణ్ తదితర హీరోలు ఉన్నారు.. ఇక హైట్ గా ఉండే హీరోలకు టాలీవుడ్ మేకర్స్ హీరోయిన్లు ఎంపిక విషయంలో కాస్త స్టార్ డం మాత్రమే కాకుండా ఎత్తు బరువు వంటి విషయాలను కూడా లెక్కలేస్తూ సినిమాలు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ హీరో సరసన ఏ హీరోయిన్ అయితే అన్ని రకాలుగా మ్యాచ్ అవుతుందో అనే విషయాన్ని గమనించి మరి అందులో హీరోయిన్గా ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది.
అయితే అప్ కమింగ్ హీరోయిన్ల విషయంలో ఈ ప్రణాళిక మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎత్తైన హీరోయిన్ ఎవరంటే అనుష్క, పూజా హెగ్డే పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ కూడా భారీ హైట్ ఉన్న హీరోయిన్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే వీళ్లకు జోడి సెట్ అవ్వాలి అంటే టాలీవుడ్లో కొంతమంది హీరోలు మాత్రమే బ్యాలెన్స్ చేయగలరు. తాజాగా వీరిద్దరిని మించి ఎత్తైన హీరోయిన్ ఉన్నది.
ఆమె ఎవరో కాదు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Fariya Abdullah).. ఈ ముద్దుగుమ్మ దాదాపుగా హీరోయిన్ల కంటే రెండు అడుగులు ఎత్తు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు పరంగా చాలా ఇబ్బందిగా మారుతోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం అలాంటి సమస్య ఏమీ లేదంటూ తెలియజేస్తోంది.. తన ఎత్తు తనకి ఎప్పటికీ మైనస్ కాదంటూ నవ్వుతూ తెలియజేసింది.
మొదట జాతి రత్నాలు చిత్రం ద్వారా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు వంటి చిత్రాలలో నటించి మెప్పించింది ఆ తరువాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్రాలలో నటించింది ప్రస్తుతం రవితేజతో కలిసి రావణాసుర సినిమాలో నటిస్తున్నది.