Indraja:స్టేజ్ పైనే ఇంద్రజను అవమానించిన యాంకర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Indraja.. తెలుగు ప్రేక్షకులకు అటు హీరోయిన్గా బుల్లితెర జడ్జిగా ఇంద్రజ(indraja) ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె మంచి పాపలారిటి సంపాదించింది. ఇలా ప్రతివారం జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో యాంకర్ గా సౌమ్య రావు కూడా వ్యవహరిస్తూ ఉన్నది. ఎక్స్ట్రా జబర్దస్త్ కు మాత్రం యాంకర్ రష్మీ వ్యవహరిస్తోంది. ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.

అలా అయితే నన్ను అడగాల్సిన అవసరం లేదు.. సౌమ్యారావుపై ఇంద్రజ ఫైర్ | actress indraja fire on soumyarao details, soumyarao, actress indraja, chalaki chanti, jabardasth promo, sriramanavami, indraja ...

ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ సౌమ్యరావు ఇంద్రజకు ఎదురు తిరగడంతో ఆమె సౌమ్యరావు పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ప్రోమోలో చూపించడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య నిజంగానే గొడవ చోటు చేసుకుందాం లేకపోతే ప్రోమో హైలెట్గా మారేలా ఇలా ప్లాన్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. వచ్చేవారం ఎపిసోడ్లో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని వేడుకలు జబర్దస్త్ కార్యక్రమంలో చాలా ఘనంగా నిర్వహించారు.

రాఘవ ,తాగుబోతు రమేష్, వెంకీ టీమ్స్ వేర్వేరుగా పానకం తయారు చేసి వాటిలో ఏది బాగుందో చెప్పాలని ఇంద్రజ, సౌమ్యరావును కోరడం జరిగింది..అయితే ఇలా పానకం టేస్ట్ చేసిన ఇంద్రజ రాఘవ టీం తయారు చేసింది బాగుంది అనగా సౌమ్యరావు మాత్రం రమేష్ వెంకీ టీం కూడా బాగానే చేశారు.. వాటీని కూడా టేస్ట్ చూడండి అని చెప్పగా అయినప్పటికీ ఇంద్రజ రాఘవ టీం తయారు చేసింది బాగుందని తెలిపింది.

ఇలా ఇంద్రజ తన నిర్ణయాన్ని చెప్పినప్పటికీ సౌమ్యారావ్ మాత్రం అక్కడ ఉన్న వారందరిని కూడా టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలని అడిగారు.. అందరిని అడగడంతో ఇంద్రజ ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను ఎందుకు అడిగావు అంటూ ఫైర్ అయ్యింది. ఇక అంతే కాకుండా ఇంద్రజ స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నట్లుగా చూపించారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Share.