NTR: ఈ ఏడాది ఎన్టీఆర్ జాతకం ఎలా ఉందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ సూచనలు సలహాలు ఇస్తూ బాగా పాపులర్ అయ్యారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి.అయితే ఈయన చెప్పినట్టుగానే ఓ యువహీరో హీరోయిన్ చనిపోతారని రెండు నెలల కిందటే వ్యాఖ్యానించాడు. గతంలో సమంత ,నాగచైతన్య పెళ్లి సమయంలో వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పారు. దీంతో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేణు స్వామి కుటుంబ విషయానికి వస్తే ఆయన వీణ అనే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా వీణ నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖురాలు ఈమె తన వీణ నైపుణ్యంతో సారంగదరియా పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Venu Swamy Predictions on Junior NTR - Telugu Bullet
అయితే ఇది కాస్త పక్కన పెడితే ఈమధ్య వచ్చిన RRR సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కీరవాణి పేర్లు మారు మోగుతున్నాయి. ఇంతటి స్థాయికి చేరుకోవటానికి ఆ సినిమా టీమ్ చాలా కష్టపడ్డారు. అయితే చాలామంది విమర్శకులు మొదటి నుంచే ఈ సినిమాలో ఎన్టీఆర్ సపోర్ట్ రోల్ మాత్రమే అని అంటున్నారు. దీంతో అభిమానులకు మాత్రం ఆ విషయం నచ్చలేదు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచిగా సెట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించిందనీ తెలియజేస్తూ ఉన్నారు..

ఎన్టీఆర్ జాతకం గురించి చెబుతూ వేణు స్వామి.. తనకు రాబోయే రోజుల్లో మంచి యోగం ఉందని సినిమాలపరంగా సక్సెస్ అవుతూ ఉంటారు.. రాబోయే రోజుల్లో మరింత కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని వేణు స్వామి తెలిపారు. ఇక ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉందని.. ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసిన కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం అవుతుందని కానీ రాజకీయాలలో మాత్రం వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వేణు స్వామి తెలిపారు.

Share.