Anushka Shetty..టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ప్రభాస్, అనుష్క(Anushka Shetty) వీరిద్దరి గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనీ త్వరలోనే..పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒకప్పుడు ఎన్నో వార్తలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే వారంలో కచ్చితంగా వీరి గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఇక ఈ వార్తలపై వారు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా నేటిజన్స్ మాత్రం వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని భావిస్తున్నారు.
ప్రభాస్ ఈ మధ్యకాలంలో ఆది పురుష్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అదే టైంలోనే ప్రభాస్ కి కృతి సనన్ కి మధ్య ప్రేమాయణం నడిచిందని వార్తలు వినిపించాయి. అయితే ఇది కాస్త పక్కన పెడితే తాజాగా సినీ క్రిటిక్ ఉమైర్ సందు మరొకసారి టాలీవుడ్ సెలబ్రిటీలపై పడ్డాడు. అంతకుముందే చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభాస్ అనుష్కలపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అదేమిటంటే ఈ విషయం వల్లే ప్రభాస్,అనుష్క చాలా ఫీల్ అయిందని.. ఇకపై ఆయనతో ఎప్పుడూ సినిమాలు చేయనని తన సన్నిహితులతో చెప్పుకుందట. అంతేకాదు ఆమె నటించే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో ఉండే కొంతమంది కూడా అనుష్క ఈ నిర్ణయాన్ని నిజంగానే తీసుకుందనీ చెబుతున్నారని ఉమైర్ సందు తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకు రావడం జరిగింది .ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
ఆయన ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ అవన్నీ నిజం కాదని అందులో ఎలాంటి నిజం లేదని చాలామంది ఆయన మాటలను కొట్టి పడేశారు.