Pooja hegde.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజ హెగ్డే (pooja hegde)బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించేందుకు అక్కడికి కూడా వెళ్ళింది. బాలీవుడ్లో ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే కి రూ.10 కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే ఒక చిత్రంలో నటిస్తున్నది.ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది.ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా తమ సినిమాకి హైప్ పెంచుకోవడానికి చాలా సతమతమవుతున్నారు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే.. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .పూజా హెగ్డే నటనకు మెచ్చి సల్మాన్ ఖాన్ ఆమె కోసం ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.
ఇక ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ రూ .10 కోట్లు ఖర్చుపెట్టి ఏ హీరోయిన్ కి గిఫ్ట్ కొనివ్వలేదు .. అలాంటిది మొదటిసారి పూజ హెగ్డే కి ఆ అవకాశం దక్కింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది ఈ రేంజ్ లో పూజ హెగ్డే కి గిఫ్ట్ ఇచ్చారంటే పూజ హెగ్డే ఏ రేంజ్ లో ఆయనని సాటిస్ఫై చేసిందో అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలపై ఏ మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది