Naga Chaitanya..నాగచైతన్యకు సంబంధించి ఎలాంటి విషయాలైనా సరే ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత,నాగచైతన్య(Naga Chaitanya) మీద పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే చాలామందికి సమంతాతో మాత్రమే నాగచైతన్య ప్రేమాయణం నడిపారని తెలుసు కానీ ఆమెతో పాటు చాలామంది హీరోయిన్స్ తో నాగచైతన్య ఎఫైర్ ఉంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి.
ముఖ్యంగా కాలేజీలో చదువుకునే రోజుల్లో కూడా ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డారని కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడని ఆ తర్వాత సమంతతో ప్రేమలో పడి ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్లి మళ్లీ విడాకులు కూడా అయ్యాయని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ విడిపోయిన తర్వాత నాగచైతన్యకు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటికీ ఎవరూ కూడా నోరు మెదపలేదు.
ఇక అంతేకా అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒక ఫోటోని దిగడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మారిపోయింది. ఇప్పటికి వీరి గురించి అక్కడక్కడ వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి. గతంలో నాగచైతన్య నటించిన మజిలీ సినిమాలో హీరోయిన్గా నటించిన దివ్యాంక కౌశిక్ తో కూడా నాగచైతన్య ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపించాయి.కానీ ఇందులో మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇక తరువాత బంగార్రాజు సినిమా చేస్తున్న సమయంలో హీరోయిన్ కృతి శెట్టి తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఇది కూడా చివరికి ఒట్టి పుకారే అన్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలా చైతన్య కెరియర్ లో ఎన్నో రూమర్లు వచ్చిన ఆయన మాత్రం ఎప్పుడూ పెద్దగా ఏ విషయం పైన స్పందించలేదు.