Allari Naresh..టాలీవుడ్ లో హీరో అల్లరి నరేష్ (Allari Naresh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. హీరోగా నటించిన ఎన్నో చిత్రాలు నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి.ఇక ఈయన తండ్రి కూడా స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ. అల్లరి నరేష్ తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది.
అల్లరి నరేష్ ఇప్పట్లో కామెడీ సినిమాలలో అసలు నటించలేదు. కేవలం కథకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడు ఇలాంటి జోనర్ లోనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు అల్లరి నరేష్. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో మహేష్ ఫ్రెండ్ గా కూడా నటించి బాగానే ఆకట్టుకున్నారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా మరొకసారి అభిమానులను బాగానే ఆకట్టుకుంది. అల్లరి నరేష్ సినీ కెరియర్ కాస్త పక్కకి పెడితే.. అల్లరి నరేష్ అప్పట్లో ఒక పెళ్లయిన హీరోయిన్ ని చాలా గ్రాండ్ గా ప్రేమించారనే వార్తలు వినిపించాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, సీమశాస్త్రి వంటి సినిమాలలో నటించిన హీరోయిన్ ఫర్జానా.
అయితే ఈ హీరోయిన్ కి అల్లరి నరేష్ కి మధ్య అప్పట్లో లవ్ ఉన్నట్లుగా పలు రూమర్లు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అల్లరి నరేష్ ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు వీరి ఎఫైర్ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.