టాలీవుడ్ డైరెక్టర్లలో కొంతమంది ఎప్పుడూ కూడా భిన్నంగా ఉంటారని చెప్పవచ్చు .వారు ఏ పని చేసినా కూడా అది భిన్నంగానే ఉంటుంది. కొన్నిసార్లు వారు ఏం మాట్లాడానా వినాలనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఏంటి ఇలా చేస్తున్నారనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో టాలీవుడ్లో చెప్పుకోదగ్గ డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, డైరెక్టర్ తేజ వంటి వారు కూడా ఒకరు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నలుగురు దర్శకులు మిగతా వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటారు. పైగా ఇందులో రాంగోపాల్ వర్మ కి కృష్ణవంశీ, తేజ ,పూరి జగన్నాథ్ ముగ్గురు కూడా శిష్యులు.. అతడు సినిమాలకు వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నలుగురు దర్శకులకు కాస్త తిక్క ఉంటుందని అప్పుడప్పుడు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉంటారు.
అందుకే అందరూ కూడా వర్మ లాగానే వ్యవహరిస్తూ ఉంటారు. వాస్తవానికి మన నిత్య జీవితంలో ఉండే విషయాలను వీరు అసలు పట్టించుకోరు.. భార్య బంధువులు అంటే వీరికి అసలు లెక్కే ఉండదు.. తీసే సినిమాలు మీద ఎక్కువగా ఫోకస్ ఉంటూ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో వర్మ విషయం కాసేపు పక్కన పెడితే.. కృష్ణవంశీ ,తేజ, పూరి జగన్నాథ్ కూడా అవతల వారిని తికమక చేసే విధంగా మాట్లాడడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.
ఈ నలుగురికి వీరి గురువును మించిన వారు మరొకరు లేరు అనే విధంగా కంబ్యాక్ ఇస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. పెట్టుబడి పెట్టడానికి ఎంతో మంది నిర్మాతలు ఉన్నప్పటికీ వీరికి నచ్చకపోతే సినిమాని మాత్రం తీయరు.వర్మ తో పోలిస్తే కృష్ణవంశీ, తేజz పూరి జగన్నాథ్ కొంతమేరకు మేలని చెప్పవచ్చు. కృష్ణవంశీ తన తల్లితో భార్యతో కలిసి ఉన్నారు. డైరెక్టర్ తేజ కాస్త గంభీరంగా ఉన్న ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. పూరి జగన్నాథ్ కూడా అంతే తన భార్య మెడలో తాళితప్ప అన్ని అమ్మేసి తిరిగి అంతకన్నా రెట్టింపు డబ్బులు సంపాదించి భార్య చేతిలో పెట్టారు ఇలా మీరు మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు పొంతనే ఉండదని చెప్పవచ్చు.