RRR.. సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా కూడా తెరకెక్కించారు. ఈ సినిమాకి నిర్మాతగా దానయ్య వ్యవహరించడం జరిగింది. దీంతో ఈ రీజన్ వల్లే మెగా కుటుంబానికి దానయ్య బినామీ అంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. RRR చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటే మరి కొంతమంది చిరంజీవి అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే ఈ వార్తల గురించి తాజాగా దానయ్య క్లారిటీ ఇవ్వడం జరిగింది.
RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్లలో డివివి దానయ్య కనిపించని సంగతి తెలిసిందే.. అయితే వేరువేరు రూమర్ల ప్రచారంలోకి వస్తూ ఉండడంతో దానయ్య కామెంట్ల గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటానని మన సినిమాలు మాట్లాడాలని నేను భావిస్తానని తెలిపారు. 2006లో జక్కన్నకు స్మాల్ అడ్వాన్స్ ఇచ్చానని తెలిపారు దానయ్య. మర్యాద రామన్న సినిమాకు నిర్మాతగా రాజమౌళి అవకాశం ఇవ్వగా పెద్ద సినిమా ఏదైనా చేస్తానని నేను చెప్పానని దానయ్య తెలిపారు.
రాజమౌళి గారికి నేను రుణపడి ఉంటానని దానయ్య అభిప్రాయం తెలిపారు. రాజమౌళి మాటపై ఉండే మనిషి అని తెలిపారు. RRR సినిమాకి ఆ రూపంలో నా ఎదురు చూపులకు ఫలితం దక్కిందని తెలిపారు.నేను డౌన్ టు ఎర్త్ మనిషిని తెలియజేయడం జరిగింది. పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు కాబట్టే RRR సినిమా ఆస్కార్ ఫంక్షన్కు కూడా నేను వెళ్లలేదని తెలిపారు.
రూ.100 కోట్లు ఇచ్చారని ఇతర నిర్మాతలు వచ్చిన కామెంట్ల విషయంలో అసలు నిజం లేదని దానయ్య వెల్లడించారు. పార్ట్నర్ అనే వార్తలలో కూడా ఎలాంటి నిజం లేదని ఫైనాన్షియల్ పైన ఆధారపడి సినిమాలు చేశామని తెలిపారు. అసలు తానే నిర్మాతగా వ్యవహరించాలని కరాకండిగా తెలియజేశారు దానయ్య. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.