ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీల విడాకులకు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా చైతన్య, నిహారిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. మెగా, అక్కినేని కుటుంబంలో కొంతమందికి వివాహం అచ్చు రాలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ ఇతర కారణాలవల్ల మొదటి భార్య రెండో భార్యకు విడాకులు ఇచ్చి మూడో అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఉదయ్ కిరణ్ ను పెళ్లి చేసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత వేరొక వ్యక్తిని వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది. రెండో వివాహం కింద కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకోగా వీరిద్దరూ కూడా విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి బాటలోనే నిహారిక కూడా వెళ్లబోతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరొకవైపు అక్కినేని కుటుంబంలో కూడా ఇవే తరహా ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. నాగార్జున మొదటి వివాహము లక్ష్మీ తో జరపగా ఆ తర్వాత విడిపోవడం జరిగింది. ఇక నాగచైతన్య, సమంత కూడా వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది. అయితే అఖిల్ వివాహానికి ముందు నిశ్చితార్థం జరగగా పలు కారణాల వల్ల అది కూడా ఆగిపోవడం జరిగింది. ఇలా చూసుకుంటే మెగా అక్కినేని కుటుంబాలకు ఏదో శాపం తగిలినట్టు ఉంది అందుకే ఇలా జరుగుతోంది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకోసం మీరు ఏదైనా పూజ చేయిస్తే బాగుంటుంది అంటూ కూడా తెలియజేస్తున్నారు.