Venkatesh: వెంకటేష్-ఆర్తి అగర్వాల్ ను అంతగా ఇష్టపడ్డారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Venkatesh.. తెలుగు సినీ ఇండస్ట్రీలో రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. (Venkatesh) టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. వెంకటేష్ కెరియర్ లో ఇప్పటివరకు 70 కి పైగా సినిమాలలో నటించారు. ఏడు నంది అవార్డులను కూడా అందుకున్నారు. వెంకటేష్ ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హిట్ కాంబినేషన్ గా పేరు పొందారు.

Nuvvu Naaku Nachchav (2001) - IMDb

ఇక విరే కాకుండా వెంకటేష్ మీనా , సౌందర్య తో కలిసి సినిమాలు చేయగా అవి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక దివంగత అందాల తార ఆర్తి అగర్వాల్ తెలుగు పరిచయం చేశారు వెంకటేష్. 2001లో కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా పరిచయమయ్యింది. అక్కడి నుంచి ఇమే కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తో వెంకటేష్ వసంతం సంక్రాంతి వంటి సినిమాలను చేస్తే ఆ రెండు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

అయితే ఇందులో వసంతం సినిమాలో హీరోయిన్గా వెంకటేష్ స్వయంగా ఆర్తి అగర్వాల్ రికమండేషన్ చేశారట. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ కి జోడిగా స్నేహ నటించిన ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఒక స్పెషల్ రోల్లో కూడా కనిపించింది. ఈ పాత్ర వెంకటేష్ పట్టు పట్టడంతో ఆర్తి అగర్వాల్ నటించింది. అయితే ఈ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండలేదు అయితే వెంకటేష్ స్వయంగా అడగడంతో ఆర్తి అగర్వాల్ కూడా కాదనలేకపోయినట్లు తెలుస్తోంది.

వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ ఫామ్ లో ఉండి ఉంటే వెంకటేష్ మరొక సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇవ్వాలనుకున్నారట.కానీ దురదృష్టవశాత్తు ఆర్తి అగర్వాల్ మరణించింది.

Share.