Naga Chaitanya..నాగచైతన్య, సమంతకు సంబంధించి ఎలాంటి విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక వీరి గురించి విషయాలు ఎంత వైరల్ గా మారుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ అప్పట్లో ఎంతో అన్యాయంగా కలిసి జీవించారు. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ వివాహమైన నాలుగేళ్లకే విడిపోవడం జరిగింది. ఇక అప్పటినుంచి నాగచైతన్య (Naga Chaitanya) సమంత ఎవరి దారిలో వారు బిజీగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఎవరి సినిమాలో వారు బిజీగానే ఉంటున్నారు ఇదే సమయంలో నాగచైతన్య గురించి రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే నాగచైతన్య ఒక ఇల్లు కొనుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నట్లుగా సమాచారం.రీసెంట్గా ఆ ఇంట్లోకి అడుగు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇల్లును మాత్రం తన రెండో భార్య కోసమే కొనుక్కున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈయన రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తన భార్యతో ప్రేవేసిగా ఉండాలని ఎవరితో కలిసి ఉన్న తనకి ఇబ్బందులు వస్తాయని గ్రహించిన నాగచైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ముందస్తు ప్రకారమే ప్లాన్ చేసుకొని మరి ఇల్లు కట్టించుకున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా నాగచైతన్య ఇలా పగడ్బందీగా ప్లాన్ చేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక అభిమానులు మాత్రం త్వరలోనే తమ హీరో రెండో వివాహం చేసుకోబోతున్నారని తెలిసి కాస్త సంతోషిస్తున్నారు. సమంత కూడా గతంలో చైతు, సమంత కలిసి ఉన్న ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆమె ఆ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో నైనా నాగచైతన్య సక్సెస్ అవుతారెమో చూడాలి మరి.