Niharika: విడాకులకు సిద్ధమైన చైతన్య-నిహారిక..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Niharika.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారిక (Niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మెగా డాక్టర్ అంటూనే తనకు ఒక స్పెషల్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నది. ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని ఎంతో ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేక పోయింది నిహారిక. మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది.

Niharika Konidela's Husband Chaitanya Jonnalagadda In Legal Trouble:  Reports - Filmibeat

కానీ ఒక్క సినిమా కూడా సరైన విజయాన్ని అందించలేదు ఈ అమ్మడికి. కనీసం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేక పోయింది . అంతలా ఈమె సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఇకపోతే నిహారిక చేసిన పనులు వర్కౌట్ అవ్వవు అంటూ ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన వివాహాన్ని చేసుకుని సక్సెస్ఫుల్ లైఫ్ ని ముందుకు తీసుకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ ఒక్కసారిగా షాక్ తగిలే విషయం ఒకటి వైరల్ గా మారుతోంది.

నిహారిక , చైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు అయితే వీరి పెళ్లి రాజస్థాన్లో చాలా ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి కేవలం కొన్ని ఓటీటి వెబ్ సిరీస్ లకు, యూట్యూబ్ లోని చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతంలో ఒకసారి పబ్బులో దొరికిన తర్వాత నిహారిక విడాకుల విషయం వైరల్ గా మారింది కానీ అందులో నిజం లేదని తేలిపోయింది.

అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ కచ్చితంగా విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అందుకు కారణం నిహారిక ఇంస్టాగ్రామ్ లో చైతన్య అన్ ఫాలో చేసింది. అలాగే చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో చేశారు. అక్కడితో ఆగకుండా వీరిద్దరూ కలిసి దిగినటువంటి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుంది మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని చూడాలి మరి.

Share.