Sharwanand..టాలీవుడ్ లో మొట్టమొదటిగా గమ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హీరో శర్వానంద్ (sharwanand). ఈ సినిమా సక్సెస్ అందుకోవటంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్న హీరోలలో ట్రెండింగ్ లో శర్వానంద్ ఒకరని చెప్పవచ్చు. ఈయన ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. శర్వా నంద్ చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనే అందుకున్నాయి. మహానుభావుడవే అనే సినిమాలో కొత్తగా ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును కూడా పొందాడు.
అయితే శర్వా ఇండస్ట్రీ లోకి రాకముందు తంసప్ యాడ్ ఫిలింలో మెగాస్టార్ చిరంజీవితో నటించాడు. దాంతో ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తరువాత అలా సినిమా అవకాశాలను అందుకొని ముందుకు దూసుకుపోయాడు శర్వానంద్.ఇక వెన్నెల ,ప్రస్థానం లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సినిమాల విషయం పక్కనపెడితే శర్వానంద్ కు ఎంత ఆస్తి ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆయనకు హైదరాబాదులోనే చాలా బిజినెస్ లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మాటలను ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాకు డబ్బు లేక కాదు సినిమాలు చేసేది. డబ్బు కోసం అయితే సినిమాలు చేయనవసరమే లేదు ఎందుకంటే నాకు చాలా డబ్బులు ఉన్నాయి.. ఇంకా వస్తాయి అని చెప్పాడు. సినిమా అంటే నాకు ఫ్యాషన్ అది నెరవేర్చుకోవటానికి సినిమాలు చేస్తున్నా అంటూ తెలిపారు.
ఒక చిత్రానికి రూ .7కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. శర్వానంద్ ఆస్తి విలువ రూ.85 కోట్లు ఉన్నట్లు ఇదే కాకుండా కొన్ని ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.ఒకప్పుడు డబ్బులేక శర్వానంద్ వాళ్ళ అమ్మ బంగారాన్ని పెట్టి మరి సినిమా తీసి అది సక్సెస్ కాకపోవటంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం రక్షిత రెడ్డి అనే అమ్మాయినతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈమె తరపు నుంచి కూడా కట్న కానుకలు భారీగా వచ్చా అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.