Alekya Reddy: అయినవాళ్లే వేధించారంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Alekya Reddy..నటుడు నందమూరి తారకరత్న మరణించి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్న తన జ్ఞాపకాలను మర్చిపోలేక తన భార్య అలేఖ్య రెడ్డి (Alekya Reddy)పలు పోస్టులను సైతం షేర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా తన భర్తను చాలా హింసించారంటూ ఒక ఆసక్తికరమైన పోస్టుని షేర్ చేసింది అలేఖ్య రెడ్డి వాటి గురించి తెలుసుకుందాం.

Tarakaratna wife Alekhya Reddy Shocking post on family and friends |  అయినవాళ్లే బాధపెట్టారు.. కానీ నువ్వు! తారకరత్న మరణించిన నెల రోజులకు భార్య  షాకింగ్ పోస్ట్– News18 Telugu

అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేస్తూ.. నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది .కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నన్ను దహించి వేస్తున్నాయి.. మన పరిచయం స్నేహంగా స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ ప్రయాణంలో నేను కొంత బెరుకుగా ఉన్న నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసే జీవించబోతున్నామంటూ చాలా నమ్మకంగా చెప్పావు అప్పటినుంచి ఆ క్షణం కోసం చాలా పోరాడావు చివరికి మన వివాహం అయిందని తెలిపింది.

అయినా ఈ వివాహంపై ఒక గందరగోళం మనపై వివక్ష అయినప్పటికీ నువ్వు నా చెంత ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నిషికమ్మ పుట్టాక మన జీవితమే మారిపోయింది. మనం అందరం ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నాము..కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్ళకు గంతలు కట్టుకొని బతికాము నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కడేవాడివి..

అలా 2019లో కవలలు జన్మించడంతో నీ కల సాధ్యమైంది.. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు నీ గుండెలో ఉన్న బాధ ఎవరికి అర్థం కాలేదు సరికాదు కనీసం దాన్ని పట్టించుకోలేదు కూడా మనకు బాగా కావలసిన వాళ్లే మన మనసుకు పదే పదే గాయం చేస్తే దాన్ని భరించలేము.. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమి చేయలేక నిస్సహాయురాలుగా ఉండిపోయాను మన ప్రయాణం మొదటినుంచి చివరి వరకు సపోర్టుగా ఉన్నది నువ్వే అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య రెడ్డి. నువ్వు రియల్ హీరో నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాము అంటూ మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను అంటూ రాసుకుంది అలేఖ్య రెడ్డి.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

Share.