రన్ విర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నతాజా చిత్రం 83 లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారధ్యంలో 1983 సంవత్సరంలో టీమిండియా వరల్డ్ కప్ ను తొలిసారిగా కైవసం చేసుకుంది. అందుకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇందులో కపిల్దేవ్ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, బ్యాక్ గ్రౌండ్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కోసం హీరో రన్ విర్ సింగ్ ఎంతో కష్టపడ్డారు.
ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో 1983 కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ సన్నివేశాలు చూపించడం జరిగింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కే ఏ ప్రొడక్షన్స్, నదియావాల గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్, కబీర్ ఖాన్ బ్యానర్ ల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.