తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట 7/G బృందావన కాలనీ సినిమాతో బాగా సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ సోనియా అగర్వాల్. ఇక తర్వాత తెలుగు తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తెలుగులో మాత్రం ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగుతున్న ధనుష్ అన్నయ్య ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే 7/G బృందావన్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
కానీ కొన్న అభిప్రాయ బేధాల వల్ల వీరిద్దరూ కొన్ని సంవత్సరాలకి విడిపోవడం జరిగింది. ఆ వెంటనే డైరెక్టర్ సెల్వ రాఘవ రెండో వివాహాన్ని చేసుకున్నారు.కానీ సోనీ అగర్వాల్ మాత్రం ఇప్పటికి సింగిల్గానే ఉంటోంది. ప్రస్తుతం ఈమె ఎక్కువగా తన కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వరుసగా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటోంది. ఇక అంతే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ఇందులో నేను ఇల్లాలు క్యారెక్టర్లలో నటించబోతున్నాను. బిడ్డకు తల్లిగా నటిస్తున్నాను వెబ్ సిరీస్ నాకు చాలా కొత్తగా అనిపించిందని తెలియజేస్తోంది.
ఇక రెండవ వివాహం గురించి మాట్లాడుతూ మీ అందరిలాగే నేను కూడా అతని కోసం వెయిట్ చేస్తున్నాను.. ఇంకెన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటాను నాకు తెలియదు.. సరైన వ్యక్తి సరైన సమయంలో కలిస్తే ఖచ్చితంగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని తెలియజేస్తోంది.దీనిబట్టి సోని అగర్వాల్ సెకండ్ వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈమె అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.