4 రోజుల్లోనే సినీ ఇండస్ట్రీలోని 3 గురు ప్రముఖులు మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్నటి రోజున సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను సోషల్మీడియాలో పంచుకున్నారు అభిమానులు. అయితే తాజాగా ఇటీవల ఒకే వారంలోనే కొంత మంది సినీ ప్రముఖులు మరణించడం జరిగింది అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒకరు.

ఇక నవంబర్ 28వ తేదీన సీనియర్ మోస్ట్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తుల సమస్య వలన హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ కన్నుమూశారు. ఇక వీరితో పాటు దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు నవంబర్ 27వ తేదీన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో అయన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

దీంతో ఒకే నెలలోనే ముగ్గురు ప్రముఖులను కోల్పోవడంతో సినీ ఇండస్ట్రీ లోని నటీనటులు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మన స్టార్ నటీనటులు కూడా ఈ ప్రముఖులకు సంతాపం తెలియజేయడం జరిగింది. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతిచెందగా ఆయన అంత్యక్రియలు ఈ రోజున జరగనున్నాయి.

Share.