అట్టర్ ఫ్లాప్ ఫార్ములాను నమ్ముకున్న రౌడీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా తన నెక్ట్స్ మూవీకి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశాడు ఈ రౌడీ హీరో. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా గుర్తుకు రావడం ఖాయం.

ఈ సినిమాలో విజయ్‌ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవర్ బాయ్‌గా విజయ్ నటిస్తుండగా అతడు నలుగురు హీరోయిన్లను ప్రేమిస్తాడని తెలుస్తోంది. ఈ కథ గతంలో వచ్చిన ఆరెంజ్ సినిమాను పోలి ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందా అని విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఆరెంజ్ సినిమా బిచానా ఎత్తేయడంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో విజయ్ జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మరి ఆరెంజ్ సినిమా ప్రభావం ఈ సినిమాపై ఎలా ఉండబోతుందా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

Share.