ఈయేడాది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని సినిమాలను విడుదల చేశారు. కొంతమంది బాగానే సక్సెస్ అయిన మరికొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. అలా ఏడాది అక్కినేని కుటుంబానికి ఒక పీడకలలా మిగిలిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మొదట్లో బంగార్రాజు సినిమాతో నాగార్జున తన కొడుకు నాగచైతన్య కలిసి ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా పర్వాలేదు అనుభవించుకుంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. అలాగే నాగార్జున చేసిన బిగ్ బాస్ -6 కూడ విమర్శకుల పాలయ్యేలా చేసింది.
ఇప్పటివరకు 5 సీజన్లను బాగానే నడిపించిన నాగార్జున 6 వ సీజన్లు మాత్రం చెడగొట్టేలా చేశారంటూ వార్తలు వినిపించాయి.నాగచైతన్య విషయానికి వస్తే ఈ ఏడాది నటించిన థాంక్యూ సినిమా కూడా చాలా ఘోరంగా పరాజయాన్ని చవి చూసింది. అలాగే బాలీవుడ్ లో నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తన భార్యతో కూడా చైతన్య విడిపోవడంతో కుటుంబం పరంగా కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి వచ్చే సంవత్సరంలోనైనా నాగచైతన్యకు మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇక అఖిల్ విషయానికి వస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ఏజెంట్ సినిమా చివరి వరకు విడుదల కాకుండానే ఉండిపోయింది. ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా రావాలని అక్కినేని కుటుంబం డిమాండ్ చేయడంతో రీ షూట్ చేస్తున్నట్లుగా ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్రెడ్డి తేరకెక్కిస్తున్నారు. మరి వచ్చేయేడాధైనా ఈ సినిమా విడుదలవుతుందేమో చూడాలి. ఏడాది మొత్తం అక్కినేని కుటుంబానికి గడ్డు కాలమని చెప్పవచ్చు.