ఎట్టకేలకు 2022వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తే.. మరి కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది. ఇంకొంతమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలా ఈ సంవత్సరంలో వివాహం చేసుకొని నూతన జీవితాన్ని మొదలుపెట్టిన సెలబ్రిటీ జంటలు ఎవరో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
అలియా భట్ – రణబీర్ కపూర్:
ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా సమయంలోనే వీరి ప్రేమకు శుభం కార్డు పడింది. దీంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వెంటనే ఈ ఏడాది ఒక ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆలియా భట్. పాప పేరు కూడా రాహా అని పెట్టుకున్నారు
మౌని రాయ్ – సూరజ్ నంబియార్:
సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని.. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా విలన్ పాత్రలో మెప్పించిన మౌని రాయ్ జనవరి 27న దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది.
నయనతార – విగ్నేష్ శివన్:
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నయనతార – విగ్నేష్ కూడా ఒకరు. అయితే మీరు జూన్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అంతే కాదు సరోగసి పద్ధతిలో వివాహం జరిగిన నాలుగు నెలలకి ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు ఈ జంట.
హన్సిక – సోహైల్:
సింధీ సాంప్రదాయ పద్ధతిలో హన్సిక కూడా ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ను డిసెంబర్ 4న వివాహం చేసుకుంది. వీరి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది.
పూర్ణ – షానిధ్ అసిఫ్:
అక్టోబర్ 26 న తాను వివాహం చేసుకున్నట్టు పూర్ణ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షానిధ్ ను వివాహం చేసుకుంది.