103 డిగ్రీల జ్వరం.. గేటు బయటే.. అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంచు లక్ష్మీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు లక్ష్మీ ఇటీవల మంచు మనోజ్ ను పెళ్లి కొడుకును చేయడం దగ్గర నుంచి నిన్న సాయంత్రం చిత్తూరులోని తమ నివాసంలో కొత్త కోడలి చేత దేవుడి గదిలో దీపం పెట్టించే వరకు అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంది మంచు లక్ష్మి.. మంచు మనోజ్ , మౌనిక రెడ్డి పెళ్లిలో ఆమె బాధ్యత వర్ణనాతీతం. అన్నింటికీ ఆమె పెద్దదిక్కుగా మారి నూతన దంపతులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే నిన్న నూతన దంపతులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న మంచు లక్ష్మి అనంతరం మోహన్ బాబు కాలేజీలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన దంపతుల చేత పూజలు చేయించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత తమ ఇంటికి వెళ్లి అక్కడ మౌనిక రెడ్డి చేత పూజ గదిలో దీపం పెట్టించిన ఈమె.. సాయంత్రం తిరిగి ఇండిగో ఎయిర్ లైన్స్ లో తిరుపతి నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండిగో సర్వీస్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ఏర్పోర్టులో గేటు బయట కూర్చుని ఫ్లైట్ టికెట్ ను ట్విట్టర్ లో పెడుతూ అసహనం వ్యక్తం చేసింది. మంచిగా ఉంటే పని అవ్వదు అంటూ ఎయిర్ లైన్స్ ను టాగ్ చేస్తూ.. వరుస ట్వీట్ లు చేశారు. నా పర్స్ విమానంలో మరిచిపోయి.. దానికోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను
మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా? అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఇండిగో సిబ్బంది.. నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను తిరుపతి నుండి హైదరాబాదు వచ్చేసాను అంటూ మరో ట్వీట్ చేశారు.

103 డిగ్రీల జ్వరం కూడా ఎలాంటి సహాయం చేయలేదు.. ఇండిగో దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా? అంటూ వీటిలో మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఇక మంచు లక్ష్మి ట్వీట్ కి ఇండిగో సిబ్బంది స్పందించారు. అయినా కోపం చల్లారని ఆమె..” డియర్ ఇండిగో.. బ్యాన్ ఇండిగో” అని కామెంట్ చేసింది.

Share.