హైదరాబాద్ కు చేరుకున్న దీపికాపదుకొణే.. అందుకోసమేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ వరస సినిమా లతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగుల కోసం అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. తాజాగా దీపికా పదుకొనే హైదరాబాదుకు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో మెరిసింది. ఈ ప్రయాణం దీపికా రాబోయే సినిమా కోసం అని సమాచారం.ఆ సినిమా ఏదో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు కే సినిమా కోసం అని సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. ముంబై విమానాశ్రయంలో దీపిక తెల్లటి క్రాఫ్ట్ టాప్ తో లైలాక్ ప్యాంట్ షూట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఉండనుంది. ఈ సినిమాతో దీపికా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/reel/CXDBZpOK7Gj/?utm_source=ig_web_copy_link

ఈ పాన్ ఇండియా చిత్రం 2022 లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదలకానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

Share.